![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లోకి కొంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ పాటబిడ్డ భోలే షావలి లోకల్. సీజన్-7 గ్రాంఢ్ లాంచ్ 2.0 లో భాగంగా అంబటి అర్జున్, అశ్వినిశ్రీ, పూజామూర్తి, నయని పావని, భోలే షావలి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నయని పావని, పూజామూర్తి ఎలిమినేషన్ అవ్వగా గతవారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు.
భోలే షావలిని మొదటి వారం చూసి ఏందిరా ఈ నస అని అనుకున్నారంతా.. ఆ తర్వాత హౌస్ లో అతని మాటతీరుతో అందరిని ఆకట్టున్నాడు. హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఫుల్ ఎంటర్‌టైన్ చేశాడు. తనదైన పంచులు, ప్రాసలతో తూటాల్లా డైలాగులు పేల్చాడు. ఇక పాటలైతే అమోఘమనే చెప్పాలి. అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పండగలు, సెలబ్రెటీలు ఇలా ప్రతి ఒక్కరిపై అప్పటికప్పుడు లిరిక్స్ అనుకొని పాటలు అల్లేసి పాడేసాడు భోలే. ఎక్కువగా శివాజీ, ప్రశాంత్, యావర్, అశ్వినిశ్రీలతో తిరిగాడు భోలే. అలానే అశ్వినితో కూడా క్లోజ్‌గానే ఉన్నాడు. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అమ్మ పాటతో ప్రేక్షకుల గుండెల్లో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుని హౌస్ నుంచి తిరిగొచ్చాడు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చిన భోలే పలు ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత బయటి మనిషి ఒక్కరంటే ఒక్కరు కూడా కనపడరని చెప్పుకొచ్చాడు. హౌస్ లో మరో శివాజీ, యావర్ అంటే ఫీవర్, హౌస్ మేట్స్ కి టెర్రర్, రైతుబిడ్డ కప్పుతోనే వస్తావురా అంటు ఒక్కొక్కరి గురించి అప్పటికప్పుడు పాటలు పాడుతూ ఎంటర్‌టైన్ చేశాడు భోలే. శివాజీ, ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ కి రెండు కళ్ళలాంటి వాళ్ళు. అంబటి అర్జున్ ని పలకరించిన మాట్లాడడు మూడీగా ఉంటాడు. బహుశ అతని బాడీ సిస్టమే అంతేనేమో అని భోలే అన్నాడు. జనాలని ఎంటర్ టైన్ చేశాను. నా దృష్ణిలో నేను కప్పు కొట్టాను అని భోలే షావలి అన్నాడు. ఇలా పలు నిజాలని భోలే షావలి షేర్ చేసుకున్నాడు.
![]() |
![]() |